కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 10 ఎకరాలు మిరప పంటను ధ్వంసం చేశాడు రైతు షఫీ. మిరప పంటపై 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే.. మూడు కోతలకు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగో కోతకు ధర పడిపోయిందని.. దీంతో గిట్టుబాట ధర రాక పంట తొలగించానని రైతు చెబుతున్నాడు.