సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెస్, కెప్టెన్ మార్ర్కమ్ క్రీజులో కొనసాగుతున్నారు. హెన్రీచ్ క్లాసెన్ కేవలం 20 బంతుల్లోనే 40 పరుగులు చేస్తు మరోసారి సన్ రైజర్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం కానుంది.
విరాట్ కోహ్లి.. మాక్సీవెల్, ఫాఫ్ డుప్లెసిస్ కు బౌలింగ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు టైటిల్ విజేతలుగా నిలిచినా బెంగళూరు జట్టుకు మాత్రం ఇంకా ఆ భాగ్యం దక్కలేదు. దీంతో ఈ సారైనా తమ జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్న ఆర్‌సీబీ అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన మాటలతో…
ఐపీఎల్‌లో రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021 ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, ఐపీఎల్ 2022 సీజన్‌కు కెప్టెన్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. ఓ దశలో మళ్లీ విరాట్ కోహ్లీకే బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా సాగింది.. అయితే, ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరు…? అనే ఉత్కంఠకు తెరపడింది.. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు…
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వైదొలగడంతో కొత్త కెప్టెన్ కోసం వెతికే పనిలో ఆ జట్టు ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న వేలంలో శనివారం రోజు ఆర్‌సీబీ జట్టు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. అయితే ఆర్సీబీ 100 శాతం డుప్లెసిస్‌నే సారథిగా ప్రకటిస్తుందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు జట్టులో ఉండటం వల్ల సమతూకం వస్తుందని, ఐపీఎల్‌లో అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయన్నాడు.…
దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడు మహమ్మద్ హస్‌నెయిన్‌ను గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హసనెయిన్ మోకాలు డు ప్లెసిస్ తలకి బలంగా తాకడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆసుపత్రిలో ఆయనకు స్కానింగ్ తీసిన…