Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు.