పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. గత వారం లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సోమవారం హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 300 రాకెట్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది.