ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.