Hyderabad: హైదరాబాద్ సిటీలో నిఘా ఎక్కువైందని.. శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. డ్రగ్ పార్టీల కోసం ఫాం హౌజ్‌లు, రిసార్ట్‌లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్ డే.. గెట్ టుగెదర్.. వీకెండ్ ఔటింగ్... అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 డ్రగ్ పార్టీలపై దాడులు చేశారు పోలీసులు. యువకుల వద్ద పెద్ద ఎత్తున్న డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్ పెట్టిన పోలీసులు..