Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి.…