మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్.. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు..