మొదటి నుంచి అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తమ నేత ప్రజా సమస్యలపై మాట్లాడాలని అడిగామన్నారు. అందరూ సభ్యుల లాగే అసెంబ్లీలో అవకాశం ఇస్తే తమ నేత వైఎస్ జగన్ కు కూడా కేవలం ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారన్నారు.