కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మదగిన నాయకుడు. రోశయ్య దివంగత నేత వైఎస్ఆర్‌కు ఆప్తుడిగా మెలిగేవారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన.. గుంటూరు నగరంలోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989, 2004లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నర్సరావుపేట నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆర్యవైశ్య కులం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతగా రోశయ్యకు మంచి పేరు…