UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది,…
యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.. రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసం కాదు, ప్రాతినిథ్యం కోసమేనని పిటిషనర్లు వాదించారు.. ఆర్థిక వెనుకబాటు తనం రిజర్వేషన్ల కల్పనకు ఆధారం కాదంటున్నారు.. 50 శాతం రిజర్వేషన్ల…
వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్…