టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి మన దేశంలో కూడా చాలా మంది టీబీ రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు ఉన్నట్లు గుర్తించారు.