80లలో దక్షిణ భారత సినిమా రంగంలో వెలుగులు నింపిన స్టార్‌ల బృందం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. వెండితెరపై చేసిన వారి ప్రదర్శనలు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో నిజమైన స్నేహాన్ని ప్రాధాన్యం ఇచ్చిన వారు అభిమానులకి చాలా ఇంపాక్ట్ ఇచ్చారు. ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ వారు “ఎయిటీస్ క్లబ్” లేదా “ఎవర్‌గ్రీన్ క్లబ్ 80” అనే క్లబ్ కూడా ప్రారంభించారు, ఇది 80ల స్వర్ణయుగపు స్టార్‌ల స్నేహ బంధానికి గుర్తుగా నిలుస్తోంది.…