ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
Electric Vehicles Fire Accidents: రానున్న రోజుల్లో పెట్రోల్, డిజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజల్ని ఎలక్ట్రిక్ వాహనాల( ఈవీ )ల వైపు మళ్లించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఈవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. దీంతో చాలా మంది ప్రజలు పెట్రోల్ బాధలు తప్పుతాయని.. ఎలక్ట్రిక్ బైకులను, కార్లను ప్రజలు కొనుగోలు చేశారు. కార్ల విషయంలో కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించి వినియోగదారులకు మెరుగైన ప్రొడక్ట్ అందించాయి. అయితే ఎలక్ట్రిక్ టూవీలర్లు మాత్రం అగ్ని ప్రమాదాలకు…