రష్యాకు డ్రోన్లను సరఫరా చేసినందుకు ఇరాన్ రక్షణ మంత్రి మహ్మద్ రెజా అష్టియాని సహా తొమ్మిది సంస్థలపై ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల ప్రభుత్వాలు అంగీకరించాయి.
తాము తయారు చేసిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. వాణిజ్యపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫ్రాన్స్ చేరుకున్నారు. గత ఐదేళ్లలో చైనా అధ్యక్షుడు యూరోపియన్ దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో ఫ్రాన్స్ సంబంధాలు మరింత లోతుగా ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన మూడు కంపెనీలపై పాటు దాదాపు రెండు డజన్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ కొత్త వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది.
Global Warming: ఎమినిది సంవత్సరాల నుంచి భూమి మండిపోతుంది. సూర్యుడి నుంచి వస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ అధ్యయన నివేదికలో తెలిపింది.
Russia - Ukraine War : రష్యాకు యూరోపియన్ యూనియన్ షాకిచ్చింది. దీర్ఘకాలంగా ఉక్రెయిన్ దేశంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా విషయంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో మొదటి అడుగు వేసింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ కమిషన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్‌కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్.. తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం…
అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన…