మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి. బీజేపీ చేరిన తరువాత ఈటల మాట్లాడారు.…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.. అయితే, తనతో పాటు.. తన అనుచరులను కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్పించాలని భావిస్తున్న ఈటల.. అందరూ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నారట.. ముఖ్యనేతలతో తనతో పాటు హస్తినకు…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈనెల 14 వ తేదీన ఈటల ఢిల్లీవెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటుగా మరికొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగానే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేవరయాంజల్ లో భూములను ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు…