మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్‌కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ…