హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారని ఆరోపించారు కేటీఆర్.. అన్ని ఆధారాలున్నాయని.. ఉప ఎన్నికలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్…