సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక…