పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ పై ఈటెల జమున ఫైర్ అయ్యారు. ఇవాళ వీణ వంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఈటెల జమున మాట్లాడుతూ… ఉద్యమాల గడ్డ హుజురాబాద్ అని.. శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారి ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులను ఎదురించి ఈటెల కొట్లాడాడని తెలిపారు.…