ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు.
అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తుందన్న వార్తల నేపథ్యంలో అసలు ఎస్మా అంటే ఏంటో తెలియక చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు. సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం 1981లో ఈ చట్టం రూపొందించారు. Read Also: ఉద్యోగులకు షాక్..…
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు.…
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న…