ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్‌కు చెందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్ అభిమానుల నుంచే పుట్టిందని, దాన్ని వారే నడిపిస్తున్నారని చెప్పాడు. ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో నా కళ్లారా చూస్తున్నా. నాలాంటి క్రికెటర్లు క్రికెట్ ఆడేప్పుడు…