PF Interest Credit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లను ఖాతాల్లోకి బదిలీ చేయడం ప్రారంభించింది.
ఉద్యోగులు తమ పీఎఫ్ వివరాలను ఎప్పకప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు.. ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఏ నిర్ణయం తీసుకున్నా ఆసక్తిగా గమనిస్తుంటారు.. వచ్చే వడ్డీని కూడా లెక్కలు వేస్తుంటారు.. అయితే, ఖాతాదారులకు శుభవార్త చెప్పింది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో)… పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో చెప్పిన గుడ్‌న్యూస్ విషయానికి వస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.50 శాతం వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేసినట్టు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. దీంతో.. 23.34 కోట్ల మంది ఖాతారులకు లబ్ధి చేకూరుతుందని…