ఉద్యోగులు తమ పీఎఫ్ వివరాలను ఎప్పకప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు.. ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఏ నిర్ణయం తీసుకున్నా ఆసక్తిగా గమనిస్తుంటారు.. వచ్చే వడ్డీని కూడా లెక్కలు వేస్తుంటారు.. అయితే, ఖాతాదారులకు శుభవార్త చెప్పింది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో)… పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో చెప్పిన గుడ్‌న్యూస్ విషయానికి వస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.50 శాతం వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేసినట్టు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. దీంతో.. 23.34 కోట్ల మంది ఖాతారులకు లబ్ధి చేకూరుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.. 2020-21ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీ రేటును 23.34 కోట్ల అకౌంట్లకు జమ చేశామని ఈపీఎఫ్‌వో వెల్లడించింది.
Read Also: పీఆర్సీపై కసరత్తు పూర్తి..!
కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటుపై అక్టోబర్‌లో నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్‌వో.. 1952 పారా 60 కిందనున్న ప్రొవిజన్ల ప్రకారం ఈపీఎఫ్ పథకంలో సభ్యులుగా ఉన్న ఖాతారాల అకౌంట్‌కి 8.50 శాతం వడ్డీని జమ చేసేందుకు.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, 1952 పారా 60(1) కింద కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తమకు తెలియజేసినట్టు ఈపీఎఫ్‌వో అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఖాతాదారులు తమ ఖాతాల్లో ఎంత జమ అయ్యిందే.. నేరుగా వారే తెలుసుకునే అవకాశం ఉంది… ఈపీఎఫ్‌వో సభ్యులు 7738299899 నెంబర్‌కి EPFOHO UAN ENG టైప్ చేసి పంపడం ద్వారా తెలుసుకునే అవకాశం ఉండగా.. లేదా పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ కోసం రిజిస్టర్డ్ యూజర్లు 011-22901406కి మిస్డ్ కాల్ ఇచ్చినా.. ఎస్ఎంఎస్ రూపంలో మీ బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కి వస్తాయి.. మరోవైపు.. ఆన్‌లైన్‌లో సంబంధిత ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో కూడా UAN నంబర్ ద్వారా లాగిన్ అయ్యి పాస్‌బుక్‌లో మీ బ్యాలెన్స్‌ను తెలుసుకునే వీలు కూడా ఉంటుంది..