ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.