నేచురల్ స్టార్ నాని వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అంటే సుందరానికీ’ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అనే లిరికల్ పాట విడుదల అయ్యింది. ‘‘ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు’’ అంటూ సాగే ఈ పాట మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది.…