నేచురల్ స్టార్ నాని వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అంటే సుందరానికీ’ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అనే లిరికల్ పాట విడుదల అయ్యింది. ‘‘ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు’’ అంటూ సాగే ఈ పాట మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది. తన గాత్రంతో సింగర్స్ అనురాగ్ కులకర్ణి, ఆ మాయాలోకంలోకి తీసుకెళ్ళాడు అనురాగ్ కులకర్ణి. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సూధింగ్ & రొమాంటిక్ పాటల్లో ఇది ద బెస్ట్‌గా నిలవడం ఖాయంలా కనిపిస్తోంది.
ఇక లిరికల్ వీడియోలోనూ నాని, నజ్రియా జంట చూడముచ్చటగా కనిపించారు. వీరి మధ్య చక్కని కెమిస్ట్రీ కుదిరింది. ఇద్దరూ నేచురల్ స్టార్స్ కావడం వల్ల, జోడీ బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. చూస్తుంటే, చాలాకాలం తర్వాత మనమంతా ఓ చక్కని రొమాంటిక్ సినిమాని చూడబోతున్నామన్న భావన కలుగుతోంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా పుష్కలంగా ఉండనున్నట్టు ఆల్రెడీ రిలీజైన టీజర్‌తో స్పష్టమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కతోన్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా జూన 10వ తేదీన విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.