భారత స్టార్ షూటర్ మను భాకర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ఇషా సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇషా క్వాలిఫికేషన్‌లో 18వ స్థానంలో నిలిచింది.
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.. ఆదివారం పారిస్ ఒలింపిక్స్‌ను ఘనంగా ప్రారంభించింది. మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో జర్మనీ క్రీడాకారిణి మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌పై విజయం సాధించి జరీన్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో జరిగిన చివరి 32 రౌండ్‌లో 28 ఏళ్ల అన్‌సీడెడ్ బాక్సర్ జర్మన్ బాక్సర్‌పై 5-0తో గెలిచింది.