Venkaiah Naidu: బాపట్ల జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నాడు పర్యటించారు. వేటపాలెం మండలంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్ల బాపయ్య విద్యా సంస్థల శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. చీరాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. అన్ని దానాలలో విద్యాదానం చాలా గొప్పదని వెంకయ్యనాయుడు…