ప్రపంచకప్ 2023లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనిపిస్తున్నాడు. టోర్నీలో ఓ సెంచరీ నమోదు చేయగా.. మిగిలిన మ్యాచ్ ల్లోనూ దూకుడుగా ఆడి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తర్వాత జరిగే ఇంగ్లండ్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అయితే ఒకటి, రెండు కాదు.. మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనున్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్ జట్టు దీన్ని సద్వినియోగం చేసుకోలేక 156 పరుగులకే ఆలౌటైంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకపై ఇంగ్లండ్‌కి ఎదురైన ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
పంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌పై శ్రీలంక ఆటగాళ్లు విజృంభించారు. 25.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై భారీ విజయాన్ని అందుకున్నారు.
రల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును శ్రీలంక 33.2 ఓవర్లలో 156 పరుగులకే పరిమితం చేసింది.
ఇంగ్లండ్తో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్‌మెంట్ అతడికి రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్.
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఆడి కష్టాల్లో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. తాజాగా.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రీస్ టోప్లీ వేలికి గాయమైంది. దీంతో మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
నిన్న జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా.. ఇంగ్లండ్ ఆఫ్ఘాన్ పై ఓడటంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోవడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ భారీ ఓటమి తర్వాత, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా ఇంగ్లండ్ ప్రపంచ కప్ 2023లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందని చెప్పాడు.
నిన్న జరిగిన ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో అతను భారత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత అభిమానులు ఆఫ్ఘనిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. అంతేకాకుండా 'ఢిల్లీ ప్రజలు మంచి హృదయం కలవారని.. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరు తమకు…