బ్రిటన్‌లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు.
England Under-19 Cricket Team visited Vijayawada Kanaka Durga Temple: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంగ్లీష్ ఆటగాళ్లకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రంను పాలకమండలి సభ్యులు అందజేశారు. Also Read: Telangana Elections 2023: కేసీఆర్‌కు బిగ్…
ఎట్టకేలకు ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది. 338 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన పాక్.. 246 పరుగులకు ఆలౌటైంది.
ఈ ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
ప్రపంచకప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ ఆశలు మరింత బలమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా లక్నోలో జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేయగా.. 230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు.
లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భాగంగా 29వ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టీమిండియాను 229 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 101 బంతుల్లో అత్యధికంగా 87 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచారు.
2023 వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఇక తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తో తలపడనుంది. రేపు(ఆదివారం) లక్నోలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రేపటి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. లక్నోలో స్పిన్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది కావున.. అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.