ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజులో రెండో సెషన్ ముగిసింది. మొదటి సెషన్‌లో భారత్ ఆధిపత్యం సాధించగా.. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. 24 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 70 రన్స్ చేసింది. జో రూట్ (54) హాఫ్ సెంచరీ చేయగా.. ఓలీ పోప్ (44) అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. రెండో సెషన్‌లో ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు.…