ఒకప్పుడు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుండేది. కానీ, ఇప్పుడు డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా క్లర్క్ జాబ్‌కోసం ట్రై చెయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత నిరుద్యోగం అనె లెక్కన మారిపోయింది. చదువుకున్న చదువు అక్కరకు రాకపోతే నచ్చిన వచ్చిన పనులు చేసుకుంటూ నాలుగు రూకలు సంపాదించి కుటుంబాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అమీర్ సోహైల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ…