బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ పార్టీ (Jan Suraj Party)ని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.