ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు, వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న అభిప్రాయం డిపార్ట్‌మెంట్‌లో పెరుగుతోంది. శాఖలో కింది నుంచి నుంచి పైస్థాయి వరకు అంతా... తన కనుసన్ననల్లో జరగాలని భావించిన చీఫ్ ఇంజనీర్ చివరికి ముచ్చటగా మూడోసారి కూడా ఏసీబీ వలలో చిక్కారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడని విధంగా ఏకంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ఓ అధికారి.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు..