పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. అయితే.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సుంకి రోడ్డుపై ఉదయాన్నే రోడ్డు దాటుతున్న గజరాజులు వాహనదారులకు ఉత్కంఠను కలిగించాయి. ఏనుగుల గుంపు రోడ్డు దాటుతున్న సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం రద్దీగా ఉన్న సమయంలో ఏనుగుల గుంపు…