క్షణికావేశం, అర్థం పర్థం లేని వ్యవహారాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తనతో మాట్లాడటం లేదని అత్మహత్యకి పాల్పడ్డాడో యువకుడు. ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న దుర్గేష్ బోయిన్ పల్లిలో ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్లి మహిళ తో పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ళుగా ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా కొంతకాలంగా మాట్లాడడం మానేసిందా మహిళ. మనస్థాపంతో మహిళ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు దుర్గేష్.…