ములుగు జిల్లా వాజేడు మండలం చేరుకూరు మోతుకులగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో మహిళా రైతుతో పాటు నాలుగు పశువులు మృతి చెందాయి. వృద్ధ రైతు దంపతులు సొంత పంట పొలంలో చెట్లు, కమ్మలు తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు నరుకుతుండగా చెట్టుకొమ్మ విద్యుత్ తీగలపై పడింది. బరువు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి.
Also Read:Weight loss Injection: బరువు తగ్గించే ఇంజెక్షన్ ‘వేగోవి’ విడుదల.. ధర ఎంతంటే..?
ఈ సమయంలో విద్యుత్ తీగల మీద ఉన్న చెట్టు కొమ్మ తొలగిస్తున్న బండి రాజమ్మ అనే వృద్ధ మహిళ రైతు విద్యుత్ షాక్ కి గురైంది. రెప్పపాటులోనే ఆమె మృతిచెందింది. ఇదే సమయంలో మేత కోసం వచ్చిన పశువులు తెగి పడిన విద్యుత్ తీగలను తగిలి నాలుగు పశువులు అక్కడికి అక్కడే మృతి చెందాయి. మహిళా రైతు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.