హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి, వాతావరణ కాలుష్యానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే దిశగా నగరంలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికుల అసౌకర్యం తగ్గడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా తోడ్పడనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర…