ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ మరో రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కొత్త మంత్రులు పాల్గొనేలే బీజేపీ హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు.
Modi Govt Cabinet Expansion: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రివర్గంలో పలు మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పలువురు మంత్రుల పేర్లు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.