Electoral Bonds Case: భారతీయ ఎన్నికల సంఘం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని గురువారం తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఎస్‌బీఐకి మార్చి 12 వరకు అంటే రేపటి వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు.