AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఆదివారం రాత్రి కొన్ని అనూహ్య పరిణామాలు…
కృష్ణా జిల్లా పెడనలో సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పెడన మండలం నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడి చేశారు.