'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' జాతీయ స్ఫూర్తిని పొంగల్ ప్రతిబింబిస్తోందని.. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమంలోనూ అదే భావోద్వేగ అనుబంధం కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోందని.. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ఉండాలని ఆకాంక్షించారు.