Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే…