అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని.. జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కాగా.. తన ఐదేళ్ల చిన్నారికి సందర్శన హక్కు కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది.