Crude Oil Conspiracy: చమురు ధరలు మళ్లీ మండిపోనున్నాయి. ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ఆయిల్ రేటు త్వరలోనే వంద డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు వారీ చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు సౌదీ అరేబియాతోపాటు ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించటమే దీనికి కారణం. ఈ ప్రకటన కారణంగా ఒక్క రోజులోనే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర 8 శాతం పెరిగింది.