తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యం లో నేడు, రేపు GHMC పరిధిలోని పాఠశాలలకు…