Komaram Bheem: కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం కారణమని, బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.…