హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థులు.. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఆసక్తికరమైన వాదనలు జరిగాయి.. కర్ణాటక సర్కార్ తరఫున అడ‍్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ హైకోర్టులో వినిపించిన వాదనలకు ప్రాధాన్యత ఏర్పిడింది.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదన్న ఆయన.. హిజాబ్ ధరించడాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని…