Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను ఏసీబీ శనివారం ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, HMDA చెల్లింపుల వివరాలు, HMDA చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు FIR ఈడీకి అందజేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయగా.. కౌంటర్‌లో ఏసీబీ కీలక అంశాలను ప్రస్తావన చేసింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని కౌంటర్‌లో ఏసీబీ పేర్కొంది.
Read also: Telangana Police: అలా చేస్తే సీజ్, లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక..
క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని తెలిపింది. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని తెలిపింది. దీనివలన హెచ్ఎండిఏ కు 8 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొంది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అని ఏసీబీ తెలిపింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ పేర్కొంది.
Read also: ATM Fraud: కామారెడ్డిలో కేటుగాడు.. ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు కాజేసిన దుండగుడు..
రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని అనడం సరైనది కాదని పేర్కొంది. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని, ఎఫ్ఈఓ కు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పారని తెలిపింది. FIR నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయలని కోరడం సరైంది కాదన్నారు. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే..కేసు నమోదు చేయవచ్చన్న ఏసీబీ.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది.
Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు